News March 4, 2025

BREAKING: నల్గొండ: 134 పంచాయతీ సెక్రటరీలకు ఛార్జ్ మెమోలు

image

తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 134 మంది పంచాయతీ సెక్రటరీలకు నల్గొండ డీపీవో వెంకయ్య ఇటీవల ఛార్జ్ మెమోలు జారీ చేశారు. అయితే మళ్లీ ఈరోజు మరోసారి ఛార్జ్ మెమోలు జారీ చేయడంతో వారు ఆందోళనలో ఉన్నారు. గతంలో వారు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు డుమ్మా కొట్టినందుకు వారిపై విచారణ కొనసాగుతోందని వెంకయ్య తెలిపారు. కాగా, మానవతా దృక్పథంతో అప్పట్లోనే కలెక్టర్ వీరిపై చర్యలు తీసుకోవద్దన్నారు.

Similar News

News March 5, 2025

నల్గొండ: ఇంటర్ వార్షిక పరీక్షలను సవ్యంగా నిర్వహించాలి: కలెక్టర్

image

రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు సవ్యంగా నిర్వహించేందుకు గాను పరీక్షలు నిర్వహించే కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్‌ను విధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని తహశీల్దార్లను ఆదేశించారు. ఈ మేరకు ఆమే ఉత్తర్వులు జారీ చేస్తూ ఇంటర్మీడియట్ పరీక్షల సక్రమ నిర్వహణకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షలు జరిగే సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు.

News March 4, 2025

నల్గొండ: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ.

image

ఈనెల 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ అన్ని రకాల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లాలో 57 పరీక్షా కేంద్రాలలో 28,722 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.

News March 4, 2025

నల్గొండ: నీట్ పరీక్షకు కలెక్టర్ కసరత్తు

image

మే 4న నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు పరీక్ష కేంద్రాల ఏర్పాటు విషయమై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలను పరిశీలించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాల, అలాగే మీర్‌బాగ్ కాలనీలో ఉన్న నల్గొండ పబ్లిక్ పాఠశాలల్లో నీట్ పరీక్ష కేంద్రాల ఏర్పాటుకై మౌలిక వసతులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

error: Content is protected !!