News February 28, 2026
BREAKING.. నస్రుల్లాబాద్: కాలేజ్ భవనంపై నుంచి దూకి ఉద్యోగి ఆత్మహత్య

నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని SRNK డిగ్రీ కళాశాలలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ అహమ్మద్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
Similar News
News March 1, 2026
రెబ్బెన: ఇంట్లో యువకుడి సూసైడ్

రెబ్బెన మండలం రాజారాం గ్రామానికి చెందిన పూదరి కిరణ్(32) శనివారం రాత్రి తన నివాసంలో తాడుతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
News March 1, 2026
భూపాలపల్లికి గర్వకారణం.. అక్కాతమ్ముళ్లు!

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన అక్క, తమ్ముడు చిందం సౌమ్య, గౌతమ్ జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ చూపారు. డెహ్రాడూన్ RIMC ఫలితాల్లో సౌమ్య తెలంగాణ నుంచి అర్హత సాధించిన ఏకైక బాలికగా నిలవగా, ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో గౌతమ్ జిల్లా ప్రథమ, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. వీరి విజయంపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News March 1, 2026
అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

AP: రాష్ట్రవ్యాప్తంగా 5వేల మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్లు, పూర్తి స్థాయి వేతనాలు ఇస్తామన్నారు. అమరావతిలో అంగన్వాడీ కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించనున్నట్లు వెల్లడించారు. వేతనాల పెంపు డిమాండ్‌నూ అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.


