News August 29, 2024

BREAKING: నాగిరెడ్డిపేట తహశీల్దార్ SUSPEND

image

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తహశీల్దార్‌ లక్ష్మణ్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ 15 రోజులుగా రైతులు MRO ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ ఎల్లారెడ్డి RDO మన్నే ప్రభాకర్ విచారణ జరిపారు. అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని RDO తెలిపారు.

Similar News

News October 6, 2024

తాడ్వాయి: గ్రేట్.. మూడు ఉద్యోగాలు సాధించాడు.!

image

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన డీఎస్సీ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన భూంపల్లి రాజశేఖర్ మూడు ఉద్యోగాలు సాధించాడు. SA సోషల్, SA తెలుగు, ఎస్జీటి గురుకుల టీజీటీ పోస్టులు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుడు పలు ఉద్యోగాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తూ రాజశేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

News October 6, 2024

NZB: నాలుగు క్వింటాళ్ల పండ్లతో అన్నపూర్ణ దేవీగా అమ్మవారు

image

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణ దేవీగా దర్శనమిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిషన్ గంజ్‌లో గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో నాలుగు క్వింటాళ్ల పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ఇందుకోసం రూ.50 వేలు వెచ్చించి 15 రకాల పండ్లు కొనుగోలు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో ఆలయంలో విశిష్ట కార్యక్రమాలు చేపడున్నామన్నారు.

News October 6, 2024

నిజామాబాద్: ముగ్గురు ఆత్మహత్య..UPDATE

image

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన <<14277266>>ముగ్గురు <<>>సురేశ్ (53), హేమలత (45), హరీశ్ (22) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వారు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు కొన్ని నెలల క్రితం ఇంటి పనులు ప్రారంభించారు. అప్పులు, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటంతో నిర్మాణ పనులు నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.