News April 5, 2026
BREAKING.. నిర్మల్‌లో అగ్ని ప్రమాదం.. ఇద్దరి మృతి

నిర్మల్ బంగల్పేట్ <<19570362>>డబుల్ <<>>బెడ్ రూమ్ ఇళ్లలో శనివారం రాత్రి ఫ్రిజ్ పేలిన ఘటనలో గాయపడిన ఇద్దరు ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులను విజయ్, ఒక మహిళగా స్థానికులు గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించడంతో వీరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోవడంతో కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Similar News
News April 6, 2026
BREAKING: కడపలో దారుణ హత్య

కడప రిమ్స్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున దారుణ హత్య చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం కడప శివారులోని అలంఖాన్‌పల్లి జాతరలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో దస్తగిరి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా కత్తితో పొడిచారు. ఈ ఘటనలో దస్తగిరి అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన కుమారుడికి గాయాలై రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 6, 2026
గుంటూరు జిల్లాలో మండిపోతున్న ఎండలు

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. అత్యధికంగా రెంటచింతలలో గరిష్ఠం 42, కనిష్ఠం 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నరసరావుపేటలో 40-27 డిగ్రీలుగా రికార్డయ్యాయి. అలాగే గుంటూరులో 38-25, తెనాలిలో 37-25 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీర ప్రాంతాలైన బాపట్ల, చీరాలలో గరిష్ఠం 35, కనిష్ఠం 26 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
News April 6, 2026
నంద్యాల: కుందూ నదిలో పడి బాలిక మృతి

కుందూ నదిలో ప్రమాదవశాత్తు కాలు జారిపడి పదేళ్ల బాలిక మృతి చెందింది. నంద్యాల మండలం హైస్కూల్ కొట్టాలకు చెందిన షేక్ సుభాన్ బాషా తన కుటుంబంతో కలిసి బండి ఆత్మకూరు మండలం సంత జూటూరు ఆనకట్టను చూడటానికి వెళ్లారు. అక్కడ షేక్ షబానా నీటిలో పడటంతో కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీసి నంద్యాల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం నిండింది.


