News April 7, 2024
BREAKING: నివేదితకు BRS కంటోన్మెంట్ టికెట్
BRS సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజవర్గ అభ్యర్థిగా లాస్య నందిత సోదరి నివేదితను KCR ప్రకటించారని ఆ పార్టీ నాయకులు ఈరోజు తెలిపారు. ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో దివంగత నేత సాయన్న రెండో కుమార్తె నివేదితకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఉగాది రోజు అధికారికంగా నివేదిత పేరును KCR ప్రకటిస్తారని నాయకులు మీడియాకు తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ MLA లాస్య మరణించిన విషయం తెలిసిందే.
Similar News
News January 3, 2025
రేవంత్ రెడ్డి పాన్ ఇండియా CM: చామల
రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని MP చామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. కొంతమంది సీఎంలు అవినీతి చేసి అందరికీ తెలిశారన్నారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ఫేమస్ అయ్యారని వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చి రైతులను బీఆర్ఎస్ మోసం చేసేందుకు ప్లాన్ చేసిందని చామల ఆరోపించారు.
News January 2, 2025
HYD: 27 మున్సిపాలిటీలపై హైడ్రాకు అధికారం
HYD నగరం నుంచి ORR వరకు ఉన్న 27 మున్సిపాలిటీలపై హైడ్రాకు అధికారం ఉందని కమిషనర్ రంగనాథ్ అన్నారు. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, శాటిలైట్ చిత్రాల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువుల్లో భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్‌పై కూడా దృష్టి పెట్టామన్నారు. హైడ్రా వచ్చినప్పటి నుంచి ప్రజలకు FTL, బఫర్ జోన్‌పై అవగాహన పెరిగిందన్నారు.
News January 2, 2025
ALERT.. HYD: మాంజాతో గొంతులు తెగుతున్నాయ్!
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే HYDలో కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండడంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ఆసిఫ్‌నగర్‌లో ఒకరు, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన దంపతులు బైకుపై వెళ్తుండగా మాంజాతో గాయాలపాలయ్యారు.