News December 13, 2025

BREAKING: నెల్లూరు మేయర్ రాజీనామా

image

అనుహ్య పరిణామాల మధ్య నెల్లూరు నగర మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించి రాజీనామా ప్రకటన చేశారు. కలెక్టర్‌ని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందిస్తానని చెప్పారు. మేయర్‌గా రాజీనామా చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తనను మేయర్‌ని చేసిన వైసీపీ అధినేత జగన్‌కు రుణపడి ఉంటానన్నారు.

Similar News

News March 7, 2026

నెల్లూరులో 9న ‘మహిళా జన సున్వాయి’

image

మహిళల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న నెల్లూరు జడ్పీ మీటింగ్ హాల్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘మహిళా జన సున్వాయి’ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆధ్వర్యంలో జరిగే ఈ డ్రైవ్‌లో జిల్లా అధికారులు, పోలీసులు పాల్గొని గృహ హింస, వేధింపులపై వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.

News March 6, 2026

‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటూ నెల్లూరు జిల్లాలో అవగాహన

image

జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చేందుకు ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో పోలీసులు భారీ నిఘా, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి, 24 డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డ్రగ్స్ అమ్మినా లేదా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం ఉన్నవారు ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా డయల్ 112 కి ఫిర్యాదు చేయాలని కోరారు.