News February 5, 2026

BREAKING: పాలమూరు యూనివర్సిటీ ఫలితాల విడుదల

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో గత సంవత్సరం నవంబర్‌లో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్) పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.palamuruuniversity.comలో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.
> SHARE IT.

Similar News

News February 20, 2026

24న ఒంగోలులో సైక్లింగ్ పోటీలు

image

ఒంగోలు మిని స్టేడియంలో ఈనెల 24వ తేదీ జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తారని జిల్లా క్రీడాధికారి సంస్థ అధికారిణి జి.రాజరాజేశ్వరి గురువారం తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారి నుంచి మాస్టర్స్ వరకు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. ముందుగా క్రీడా యాప్‌లో పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు.

News February 20, 2026

KMR: ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో వైద్య శిబిరాలు

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు జిల్లాలో 38 ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ విద్య తెలిపారు. గురువారం ఆమె ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 18 వరకు ఆయా కేంద్రాల్లో పీహెచ్‌సీ సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.