News February 20, 2026
BREAKING.. పెద్దపల్లి: ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

పెద్దపెల్లి జిల్లా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ ప్రవేట్ డాక్యుమెంట్ రైటర్ రషీద్‌తో కలిసి పుట్టపాక గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద లంచం డిమాండ్ చేయగా, ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో వారి ఇరువురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పుట్టపాక గ్రామానికి చెందిన ఓ రైతు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రూ.16,500 లంచం డిమాండ్ చేశారు.
Similar News
News February 20, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

* విజయవాడలో కూతురి పట్ల తండ్రి అసభ్య ప్రవర్తన
* చంద్రబాబును జైళ్లో వేయాలి: పేర్ని నాని
* విజయవాడలో ప్రమాదం.. ఒకరి మృతి
* పెనమలూరు: KTM పండుకు పీటీ వారెంట్
* బందరులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
* విజయవాడ బెంజి సర్కిల్‌లో చీకటి వ్యాపారం
News February 20, 2026
WGL: ప్రత్యేక తరగతులపై కొరవడిన పర్యవేక్షణ!

జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఒక వైపు కలెక్టర్ చెబుతున్న.. మరోవైపు ప్రత్యేక తరగతుల నిర్వహణ అధ్వానంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం 8-9, సాయంత్రం 4.15 -5.15 గంటల వరకు స్పెషల్ క్లాస్‌లు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా, వాటిపై పర్యవేక్షణ లేదు. గతంలో మాదిరిగా ఇతర డిపార్ట్మెంట్ సిబ్బందిచే ఇన్విజిలేటర్ డ్యూటీస్, టెస్టులు నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
News February 20, 2026
TGRSA కరీంనగర్ డైరీని ఆవిష్కరించిన అదనపు కలెక్టర్

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కరీంనగర్ డైరీని అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ ఉద్యోగులు ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. శాఖ చరిత్ర, ముఖ్య సమాచారం, ఉపయోగకరమైన వివరాలతో డైరీని రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, జిల్లా రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.


