News December 13, 2025

BREAKING: పెద్దపల్లి: ఘోర రోడ్డు ప్రమాదం

image

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరినాట్లు వేసేందుకు మహారాష్ట్ర నుంచి సుల్తానాబాద్‌కు వస్తున్న వలస కూలీలు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Similar News

News December 17, 2025

స్పీకర్ నిర్ణయంతో BRSకు షాక్

image

TG: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న <<18592868>>MLA<<>>లపై అనర్హత వేటు పడితే ఉపఎన్నికలు వస్తాయని BRS ఆశించింది. అందుకోసం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పోరాడుతోంది. కానీ తాజాగా స్పీకర్.. ఐదుగురు MLAలకు క్లీన్‌చిట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా స్పీకర్ నిర్ణయంతోనే ఏకీభవించనుంది. దీంతో ఉపఎన్నికల్లో గెలుస్తామని భావించిన కారు పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కాగా ఇప్పటికే 2 ఉపఎన్నికల్లో BRS ఓటమిపాలైన విషయం తెలిసిందే.

News December 17, 2025

సమావేశానికి హాజరైన చిత్తూరు కలెక్టర్

image

జిల్లా కలెక్టర్‌లతో సీఎం చంద్రబాబు అమరావతిలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పని చేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులే కీలకమని సీఎం సూచించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని ఆదేశించారన్నారు.

News December 17, 2025

వనపర్తిలో తుది విడత 85.55% ఫలితాలు!

image

వనపర్తి జిల్లాలో పెబ్బేరు, శ్రీరంగాపూర్, పానగల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలలో నిర్వహించిన మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసే సరికి అత్యధికంగా పెబ్బేరు 88.71%, అత్యల్పంగా పానగల్ 82.94% పోలింగ్ నమోదయింది. వీపనగండ్ల 84.84%, శ్రీరంగాపూర్ 85.51%, చిన్నంబావి 87.29% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.