News March 5, 2025

BREAKING.. పెద్దపల్లి: సార్ వద్దంటూ.. విద్యార్థుల ధర్నా

image

పెద్దపల్లి మండలం నిట్టూరు జిల్లా పరిషత్ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయుడు వద్దంటూ విద్యార్థులు ధర్నా చేశారు. గత కొంతకాలంగా ఉపాధ్యాయుల మధ్య వచ్చిన గొడవ విద్యార్థులకు అంటకడుతూ పాఠాలు బోధించకుండా కుల వివక్ష చూపుతున్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ధర్నా చేపట్టారు. ఈ విషయం అధికారులకు తెలిసినా కనీసం స్పందించని పరిస్థితి ఉందని గ్రామస్థులు తెలిపారు.

Similar News

News April 13, 2026

శ్రీశైలంలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు

image

శ్రీశైలంలో సోమవారం రాత్రి ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాకు చెందిన కొందరు భక్తులు మల్లన్న దర్శనార్థమై కారులో శ్రీశైలం వచ్చారు. దేవస్థానం టోల్ గేట్ దాటిన తర్వాత కుక్క అడ్డురావడంతో దానిని తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్లో ఉన్న ఏడుగురిలో ముగ్గురికి గాయాలు కాగా.. ఓ మహిళకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2026

9 పరుగులకే సగం మంది ఔట్

image

RRతో మ్యాచులో SRH బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. 3 ఓవర్లలో 9 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. ప్రఫుల్ హింగే 4, సాకిబ్ హుస్సేన్ ఒక వికెట్ తీశారు. వైభవ్, జురెల్, ప్రెటోరియస్ డకౌట్ అయ్యారు. జైస్వాల్ (1), పరాగ్ (4) కూడా ఫెయిల్ అయ్యారు. ప్రస్తుతం రాజస్థాన్ స్కోర్ 3.3 ఓవర్లలో 11/5గా ఉంది. విజయానికి మరో 206 రన్స్ కావాలి.

News April 13, 2026

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్

image

కొండపాక మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, అందుకు రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించాలని పిలుపునిచ్చారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించాలని ఆమె ప్రజలకు సూచించారు.