News February 27, 2026
BREAKING: పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.550 పెరిగి రూ.1,61,570కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.500 ఎగబాకి రూ.1,48,100 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
Similar News
News March 4, 2026
BJP ‘రాజ్య’సభ వ్యూహం ఇదే..

BJP <<19289210>>రాజ్యసభ<<>> అభ్యర్థుల ఎంపిక వెనక స్పష్టమైన వ్యూహాలు ఉన్నట్లు అర్థమవుతోంది. పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్‌ను ఎగువ సభకు పంపడం ద్వారా 2029 ఎన్నికల కోసం ఆయన్ను జాతీయ రాజకీయాల్లో స్థిరపరచాలని అనుకుంటోంది. కుల సమీకరణాలకు ప్రాధాన్యం ఉండే బిహార్‌లో దళిత నేత శివేశ్‌ను ఎంపిక చేసింది. అస్సాం, బెంగాల్ వంటి ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేలా అభ్యర్థులను సెలక్ట్ చేసింది.
News March 4, 2026
వార్ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’ రిలీజ్ వాయిదా

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈనెల 19న రావాల్సిన ఈ చిత్రాన్ని మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల అవుతుందని ప్రకటించింది. ఇంగ్లిష్‌తో పాటు భారతీయ భాషల్లో విడుదల కానున్నట్లు తెలిపింది.
News March 4, 2026
ఇండియా కంటే ఇంగ్లండ్ స్పిన్ మెరుగ్గా ఉంది: మైఖేల్ వాన్

T20 WC: భారత్‌తో జరగనున్న సెమీఫైనల్లో ఇంగ్లండ్‌దే పైచేయి అని ఆ దేశ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ జోస్యం చెప్పారు. ఇంగ్లండ్ వద్దే మెరుగైన స్పిన్ అటాక్ ఉందని అభిప్రాయపడ్డారు. ఆదిల్ రషీద్, లియామ్ డాసన్, విల్ జాక్స్ ఈ టోర్నీలో బెస్ట్ ఇచ్చారని కొనియాడారు. టీమ్‌ఇండియా X-ఫ్యాక్టర్ వరుణ్ చక్రవర్తిని ప్రత్యర్థి బ్యాటర్లు ఈజీగా ఎదుర్కొంటున్నారని, ఫీల్డింగ్‌లోనూ భారత్ వెనకబడి ఉందని విమర్శించారు.


