News March 11, 2026

BREAKING: పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.930 పెరిగి రూ.1,63,310కు చేరింది. నిన్నటి నుంచి రూ.1,630 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.850 ఎగబాకి రూ.1,49,700 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.3,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.

Similar News

News April 14, 2026

మరోసారి చర్చలకు డేట్ ఫిక్స్!

image

యుద్ధానికి ఎండ్ కార్డ్ వేసేందుకు అమెరికా-ఇరాన్ మరోసారి శాంతి చర్చలు జరపాలని భావిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే గురువారం పీస్ టాక్స్‌కు అవకాశం ఉంది. అయితే మరోసారి ఇస్లామాబాద్‌ను వేదికగా ఎంచుకుంటారా? లేక మరో దేశంలో చర్చిస్తారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

News April 14, 2026

నోటి పుండ్లు.. క్యాన్సర్ సంకేతం కావొచ్చన్న వైద్యులు

image

ఎండాకాలం వేడి వల్ల నోటిలో పుండ్లు వచ్చి వాటంతట అవే తగ్గుతాయని నిర్లక్ష్యం చేయొద్దని, 14 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘ముఖ్యంగా పొగాకు వాడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు అవసరమైతే బయాప్సీ పరీక్ష ద్వారా అది సాధారణ పుండా లేదా క్యాన్సర్ సంకేతమా అని నిర్ధారిస్తారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది’ అని చెబుతున్నారు.

News April 14, 2026

ప్రేమ కోసం పోరాడే గ్యాంగ్‌స్టర్‌గా ‘సైయారా’ హీరో

image

గతేడాది <<17590211>>‘సైయారా’ చిత్రంతో<<>> సూపర్ హిట్ కొట్టిన అహాన్ పాండే కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలీ అబ్బాస్ డైరెక్షన్‌లో రొమాంటిక్ యాక్షన్ మూవీలో నటించనున్నారు. ఇందులో అహాన్ ప్రేమ కోసం పోరాడే గ్యాంగ్‌స్టర్ రోల్ పోషిస్తారని సమాచారం. ప్రస్తుతం వెపన్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శార్వరీ వాఘ్ నటిస్తారని టాక్.