News March 6, 2026

BREAKING: ఫైనల్లోకి భారత్

image

T20WCలో భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 రన్స్ తేడాతో విజయం సాధించింది. 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లిష్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. బెథెల్ సెంచరీతో (48 బంతుల్లో 105) బెంబేలెత్తించినా చివర్లో వికెట్లు పడటంతో భారత్ విజయం సాధించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది.

Similar News

News March 6, 2026

‘ఆశా’లకు కొత్త ఫోన్లు, 2 చీరలు: సత్యకుమార్

image

AP: ఆశావర్కర్లకు GOVT గుడ్ న్యూస్ చెప్పింది. వారికి కొత్త ఫోన్లు, 2 కొత్త చీరలు ఇస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. NHM ప్రకారం ఇతర ఉద్యోగుల మాదిరే సెలవులు ఇస్తామన్నారు. దహన సంస్కారాల‌కు ₹15,000 ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 1,363 ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. బీమా సౌకర్యం వర్తింపునకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.

News March 6, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 6, 2026

T20WC-2026.. రికార్డులు బద్దలు

image

* ఒక T20WC ఇన్నింగ్స్‌లో అత్యధిక టీమ్ సిక్సర్లు-19(IND)
* ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు-88(IND). ఇదే ఏడాది విండీస్ 76, సౌతాఫ్రికా 72 సిక్సర్లు.
* మెన్స్ T20లలో మోస్ట్ 250+ స్కోర్లు-5(IND)
* T20WC నాకౌట్స్‌లో హయ్యెస్ట్ స్కోర్- 253/7(IND)