News August 5, 2025

BREAKING: బాచుపల్లిలో యాక్సిడెంట్.. స్టూడెంట్ మృతి

image

HYD బాచుపల్లి PS పరిధిలోని ప్రగతినగర్ ఎలీప్ సర్కిల్ వద్ద ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అతివేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న మూసాపేట్ అంజయ్య నగర్‌కు చెందిన స్టూడెంట్ నిఖిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Similar News

News August 6, 2025

బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయానికి విజయ్ దేవరకొండ

image

బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో నటుడు విజయ్ దేవరకొండ నేడు బషీర్‌బాగ్ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే నటుడు ప్రకాశ్‌రాజ్‌ను విచారించగా.. మళ్లీ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయనని ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు రానాకు ఆగస్టు 11న, మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ నీటీసులు జారీ చేసింది.

News August 6, 2025

AP యువతులతో HYDలో వ్యభిచారం

image

మేడిపల్లి PS పరిధిలోని ద్వారకానగర్‌లో ఉండే స్వప్న బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. భర్త చనిపోయి ఆర్థిక ఇబ్బందులతో ఈజీ మనీ కోసం తెలిసినవారు నవీన్, అశోక్‌లతో కలిసి ఏపీ యువతులను రప్పించి వ్యభిచార గృహం నిర్వహిస్తోందని పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో SI నర్సింగ్‌రావు సిబ్బందితో కలిసి దాడి చేసి ఇద్దరు యువతులు, ఓ విటుడు, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. 3 సెల్‌ఫోన్లు, రూ.1200 స్వాధీనం చేసుకున్నారు.

News August 6, 2025

HYD: పోలీసు కార్యాలయాల్లో పాత వస్తువుల వేలం

image

హైదరాబాద్ సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, పెట్లబుర్జు కార్యాలయంలోని పాత వస్తువులు వేలం వేయనున్నారు. ఈనెల 7వ తేది ఉ.11 గంటలకు వేలం వేస్తున్నట్లు DCP రక్షిత కృష్ణమూర్తి ప్రకటించారు. ఈ వేలంలో పాత ఐరన్, ఏసీలు, టెంట్, చెక్క కుర్చీలు, ఫర్నిచర్స్, హెల్మెట్స్, ఎయిర్‌కూలర్లు, ప్లాస్టిక్ కుర్చీలు వేలం వేయనున్నారు. ఆసక్తి గలవారు CI రవి 8712661326ని సంప్రదించాలన్నారు.