News February 13, 2026

BREAKING: భూదాన్ పోచంపల్లిలో హంగ్

image

యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 13 వార్డులకు గాను కాంగ్రెస్ 6, BRS 5, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి 1 వార్డు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 7 ఎవరూ సాధించకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News February 16, 2026

నిమ్స్‌లో 850 పోస్టుల భర్తీపై ఫోకస్!

image

TG: నిమ్స్ ఆసుపత్రి విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా 850 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీరిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 125 వెంటిలేటర్లు మంజూరు చేయగా రూ.1,698 కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ గ్రాంట్లు పెరగగా ఏడాదిలోనే రూ.122 కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చాయి.

News February 16, 2026

విశాఖ డెయిరీ పాల రేట్లు ఎంత పెరిగాయంటే..

image

విశాఖ డెయిరీ పాల అమ్మకం ధరలను పెంచింది. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. అర లీటర్ హోమోజినైజ్డ్ డబుల్ డోన్డ్ పాలు ధర రూ.26 నుంచి రూ.27కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాల ధర అర లీటరు రూ.28 నుంచి రూ.29కు పెంచింది. స్టాండర్ డైజ్డ్ పాలు అర లీటరు రూ.31 నుంచి రూ.32కు, ఫుల్ క్రీం పాలు లీటరు రూ.66 నుంచి రూ.68కు పెరిగింది.

News February 16, 2026

నిజమాబాద్‌కు మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్క

image

నేడు జరగనున్న నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క నగరానికి రానున్నారు. తొలుత కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేస్తారు. తర్వాత మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ప్రత్యేక సమావేశానికి హాజరు కానున్నారు. MIM కార్పోరేటర్‌లతో కలిసి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకోనున్న సంగతి తెలిసిందే.