News March 13, 2025
BREAKING: మంచిర్యాలలో విషాదం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని 100 ఫీట్ల రోడ్డు ఏరియాలో తల్లి, కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగగా.. అనంతరం పురుగుమందు తాగారు. తల్లి పోచమ్మ మృతి చెందగా.. కూతురు రాజమ్మ ప్రాణాపాయ స్థితిలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 29, 2026
నల్గొండ: మహిళలకు టైలరింగ్ కోర్సులో ఉచిత శిక్షణ

నల్గొండలోని రాంనగర్ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ స్త్రీలకు టైలరింగ్ కోర్సులో 31 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు సియాజీ రాయ్ తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 19 సం.నుంచి 45లోగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు అర్హులని, ఆసక్తి గల వారు ఏప్రిల్ 2లోగా సంస్థలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9701009265 సంప్రదించాలని కోరారు.
News March 29, 2026
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో ప్రత్యేక వేదిక

పార్వతీపురం జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్‌ఎస్ వేదికను నిర్వహిస్తున్నామని కలెక్టర్ ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యల కోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ ఏర్పాటు చేశామని చెప్పారు. అర్జీలు Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని, వాటి స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. ప్రతి సోమవారం అన్ని కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తున్నామన్నారు.
News March 29, 2026
NZB: ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కోటగిరి, మోస్రా 41.4°C, భీమ్ గల్ 41.3, సాలూర, జకోరా 41.2, బాల్కొండ, మెండోరా 41.1, మంచిప్ప, బిచ్కుంద 40.7, పిట్లం 40.6, జక్రాన్ పల్లి, చీమన్ పల్లి 40.5, భిక్కనూరు 40.4, తొండకూర్, ఎల్పుగొండ 40.3, నిజామాబాద్ సౌత్, కొల్లూరు 40.2, మాగిడి, పెర్కిట్, లక్మాపూర్, మోర్తాడ్, మేనూర్ 40.1°C ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


