News January 11, 2026
BREAKING మద్దికేరలో ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

మద్దికేరలో ఆదివారం ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. పత్తికొండకు ఇటుకల లోడుతో వెళ్తుండగా బురుజుల రోడ్డు సెల్ టవర్ వద్ద ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన బోయ కిష్టప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై ఉన్న అబ్దుల్ అజీజ్, శివ గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు ఎస్సై హరిత తెలిపారు.
Similar News
News February 10, 2026
ఇంకెన్నాళ్లు కల్తీ రాజకీయం: SV మోహన్ రెడ్డి

తిరుమల, శ్రీశైలం దేవాలయాల్లో లడ్డూ ప్రసాదం కల్తీ అని ఆరోపణలు చేస్తున్న సీఎం చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూ వివాదంలో బీజేపీ అగ్ర నాయకత్వం ఇప్పటివరకు ఒక్కమాటా మాట్లాడలేదని, ఇంకెన్నాళ్లు ఈ కల్తీ రాజకీయం చేస్తారని ఆయన మండిపడ్డారు.
News February 10, 2026
కర్నూలు రేంజ్‌లో 9 మంది సీఐల బదిలీ

కర్నూలు రేంజ్ పరిధిలో 9 మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభాకర్ రెడ్డి అన్నమయ్య- SM నంద్యాలకు, అహ్మద్ రియాజ్ ప్రొద్దుటూరు-నంద్యాలకు, గోవింద్ రెడ్డి, దస్తగిరి కడప-నంద్యాలకు, ప్రసాద్ బాబు మన్నూరు-అన్నమయ్యకు, లింగప్ప బద్వేల్-మాన్నూరు, రామకృష్ణ SSS(D)- బద్వేల్‌కు, మహ్మద్ రఫీ మదనపల్లి 1-2టౌన్‌కు, రాజారెడ్డిని మదనపల్లి 2- 1టౌన్‌కు బదిలీ చేశారు.
News February 10, 2026
అభివృద్ధి పనుల్లో స్పష్టమైన పురోగతి చూపాలి: కర్నూలు కలెక్టర్

జిల్లాలో అన్ని శాఖలు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఖచ్చితమైన పురోగతి కనిపించాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. మార్చిలో జరిగే కలెక్టర్ల సమావేశం నాటికి అన్ని విభాగాల్లో ఫలితాలు చూపాలని సూచించారు. జాబ్ మేళాల ద్వారా 7 నుంచి 8 వేల మందికి ఉపాధి కల్పించాలని, PGRS ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచాలని ఆదేశించారు.


