News February 6, 2025
BREAKING: మహబూబ్‌నగర్ జిల్లాలో MURDER
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని అదే గ్రామానికి చెందిన అలీ ఖాన్(36) తరచూ వేధిస్తున్నాడు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్‌లో ఈరోజు కూడా మళ్లీ ఆమెను వేధించసాగాడు. విషయం తెలుసుకున్న అబ్దుల్ రహమాన్ తన కూతురిని వేధిస్తావా అంటూ అలీని రాడ్డుతో కొట్టి చంపేశాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు.
Similar News
News February 6, 2025
MBNRలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా న్యూ టౌన్‌లో జరిగింది. స్థానికుల వివరాలు.. నారాయణపేట జిల్లాకు చెందిన శశాంక్ (19) నల్గొండకు చెందిన జ్ఞానేశ్వర్ (18) పట్టణంలోని మెడికల్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్నారు. బైక్‌పై వెళుతున్న ఇద్దరూ.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 6, 2025
కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య
కోడేరు మండల కేంద్రంలోనికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. చిన్నరాజు రాత్రి తమతో కలిసి పడుకున్నాడు. తెల్లారేసరికి ఉరేసుకుని కనిపించటంతో వారు చుట్టపక్కల వారిని పిలిచారు. స్థానికులు మృతదేహాన్ని కిందికి దించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతుడికి భార్య కళమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 6, 2025
MBNR: గురుకులంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
బాలానగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈరోజు ఉదయం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. విద్యార్థినిని టీచర్లు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యలు నిర్ధారించారు.