News December 23, 2025

BREAKING: మాజీ MP ఆదికేశవులు కుమారుడు, కుమార్తె అరెస్ట్

image

మాజీ MP DK ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజలను CBI అధికారులు సోమవారం అరెస్టు చేశారు. వ్యాపారవేత్త రఘునాథ్ మృతి కేసు విచారణలో అరెస్టు చేసినట్లు సమాచారం. 2019 మే 4వ తేదీన అనుమానాస్పద రీతిలో రఘునాథ్ మృతిచెందాడు. దీంతో రఘునాథ్ భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్ష్యాలు నాశనం చేయడం, పత్రాల ఫోర్జరీ, ప్రభుత్వ స్టాంపులు, సీళ్లను సృష్టించడం వంటి వాటిపై CBI కేసు నమోదు చేసింది.

Similar News

News December 23, 2025

కృష్ణా: UPHS, PHCలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు DMHO యుగంధర్ తెలిపారు. UPHSలలో ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్ట్ ఒకటి, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు 7, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు10, PHCలలో ల్యాబ్ టెక్నిషియన్ 12, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 16, శానిటరీ అటెండర్ కం వాచ్‌మెన్ పోస్టులు 10 ఖాళీలకు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News December 23, 2025

ప.గో: ఆరుగురు పురోహితులపై వేటు.. అసలేం జరిగిందంటే!

image

అన్నవరం సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాల్లో భక్తుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసిన ఆరుగురు వ్రత పురోహితులపై వేటు పడింది. ఈ నెల 21న పాలకొల్లులో నిర్వహించిన వ్రతాల్లో ఈ అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఈఓ త్రినాథరావు ఈ చర్యలు తీసుకున్నారు. ఒక గుమస్తాకు నోటీసు జారీ చేశారు. మంత్రి రామానాయుడు సిఫార్సుతో ఈ వ్రతాలు జరిగిన విషయం తెలిసిందే.

News December 23, 2025

పార్వతీపురం: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

image

మక్కువ మండలం కొయ్యనపేట గ్రామానికి చెందిన బేతనపల్లి సీతం నాయుడు (75) ఈ నెల 15వ తేదీన పురుగుల మందు తాగారు. అప్పటి నుంచి పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. ఈ ఘటనపై మక్కువ ఎస్ఐ ఎం.వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.