News February 11, 2025
BREAKING.. ములుగు: పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739258508363_1047-normal-WIFI.webp)
ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆలెం స్వామి, అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 11, 2025
ప్రముఖ క్రికెటర్ రిటైర్మెంట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739273537657_695-normal-WIFI.webp)
దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన షెల్డన్ జాక్సన్ రిటైర్మెంట్ ప్రకటించారు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన ఇతను ఫస్ట్ క్లాస్+లిస్ట్ A+T20లలో పదివేలకు పైగా పరుగులు చేశారు. ఇందులో 31 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే జాతీయ జట్టుకు మాత్రం ఎంపిక కాలేదు. IPLలో RCB, KKR జట్లు ఇతడిని కొనుగోలు చేసినప్పటికీ కేవలం 9 మ్యాచ్‌ల్లోనే ఆడే అవకాశం వచ్చింది.
News February 11, 2025
గగన్‌యాన్ ద్వారా స్పేస్‌లోకి ఈగలు.. ఎందుకంటే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739273860196_1199-normal-WIFI.webp)
ఇస్రో చేపట్టిన గగన్‌యాన్-1 మిషన్ ద్వారా ఈగలను (fruit flies) అంతరిక్షంలోకి పంపేందుకు TIFR సిద్ధమవుతోంది. జీవరాశిపై స్పేస్ ట్రావెల్ ప్రభావం, అనుభవించే స్ట్రెస్, జీవ రసాయన మార్పులను తెలుసుకోవడమే ఈ ప్రయోగ లక్ష్యం. మానవుల్లో రోగాలపై ప్రభావం చూపే జెనెటిక్ పాథ్‌వేస్‌ను 75% షేర్ చేసుకుంటుండటంతో ఈగలను ఎంచుకున్నారు. మైక్రో గ్రావిటీ ఉండే స్వల్పకాల స్పేస్ ట్రావెల్‌లో మెటబాలిజం ఫిట్‌నెస్‌ను తెలుసుకోనున్నారు.
News February 11, 2025
గద్వాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఇలా..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739272803357_52038834-normal-WIFI.webp)
గద్వాల జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలో 13 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, 142 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలోని గద్వాల అలంపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 255 గ్రామ పంచాయతీలు ఉండగా 3,88,196 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో 12 జడ్పీటీసీ స్థానాలు ఉండగా ఎర్రవల్లి నూతన మండలం ఏర్పాటు కావడంతో ఆ సంఖ్య 13కు చేరింది.