News February 11, 2025

BREAKING.. ములుగు: పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య

image

ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆలెం స్వామి, అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 11, 2025

పాఠశాలలకు కోడిగుడ్లు పంపిణీ నిలుపుదల: కలెక్టర్

image

బర్డ్ ఫ్లూ తో కోళ్లు మరణిస్తున్న నేపథ్యంలో వారం రోజులు పాఠశాలలకు, అంగన్వాడీలకు కోడిగుడ్లు పంపిణీని నిలిపివేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మార్వో, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో చర్చించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సాంఘిక వసతి గృహాలు, గురుకుల పాఠశాలల పిల్లలకు కోడిగుడ్లు సరఫరా నిలిపివేయాలన్నారు.

News February 11, 2025

ఆధార్ అప్‌డేట్‌కు ప్ర‌త్యేక డ్రైవ్‌లు చేప‌ట్టండి: కలెక్టర్

image

ఐదేళ్లకు పైబ‌డిన పాఠ‌శాల విద్యార్థులు, 15 ఏళ్ల‌కు పైబ‌డిన విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా ఆధార్ బ‌యోమెట్రిక్ అప్‌డేష‌న్ చేయించాల్సి ఉంటుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్ర‌త్యేక డ్రైవ్‌లు చేప‌ట్టాల‌ని ఆయన తెలిపారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లాస్థాయి ఆధార్ ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. జిల్లాలో ఆధార్ న‌మోదు స్థితిగ‌తులపై చర్చించారు.

News February 11, 2025

వైసీపీ పంచాయితీరాజ్‌ విభాగం డైరీ ఆవిష్కరణ

image

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైసీపీ పంచాయితీరాజ్‌ విభాగం డైరీ 2025ను వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆవిష్కరించారు. గ్రామ స్వరాజ్యం స్ధాపనకు గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, స్ధానిక సంస్ధల బలోపేతంతో పాటు ఆర్ధికంగా వాటిని స్వయంసమృద్ధి దిశగా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు.

error: Content is protected !!