News December 14, 2025
BREAKING: మెదక్‌లో తొలి ఫలితం

మెదక్ మండలం బాలానగర్ సర్పంచ్‌గా బెండ వీణ విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి వీణ సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. వీణ మెదక్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామభివృద్ధికి కృషి చేస్తా అన్నారు.
Similar News
News March 3, 2026
నాటుసారాను పూర్తి స్థాయిలో నివారించాలి: కలెక్టర్

నాటుసారా విక్రయదారుల కుటుంబాల జీవనోపాధికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏ కేటగిరీలో 19 గ్రామాలు, బీ కేటగిరీలో 19 గ్రామాలు, సీ కేటగిరిలో 91 గ్రామాలలో నాటు సారాను పూర్తి స్థాయిలో నివారించడానికి, ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మారడానికి కృషి చేయాలన్నారు.
News March 3, 2026
అచ్చంపేట: ఇంటి ముందు క్షుద్రపూజల కలకలం

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనిలోని ఒక ఇంటి ముందు క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగులు పూజలు చేసి ఒక ఇంటి ముందు మెట్లపై పాము బొమ్మ, పసుపు కుంకుమ, బియ్యం, నిమ్మకాయలు, కోడి కట్టి వేశారు. గమనించిన కుటుంబ సభ్యులు, కాలనీవాసులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.
News March 3, 2026
సాయుధుల ఊచకోత.. 169 మంది మృతి

దక్షిణ సూడాన్‌లోని ఓ గ్రామంలో సాయుధులు జరిపిన దాడిలో 169 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధంలో భాగంగా ప్రతిపక్ష నేత రీక్ మచర్ మద్దతుదార్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 90 మంది సాధారణ పౌరులు చనిపోయారని.. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నట్లు UN మిషన్ వెల్లడించింది. ఈ దాడి తర్వాత వెయ్యి మంది తమను ఆశ్రయించినట్లు తెలిపింది. చర్చల ద్వారా ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేతలు సంధి కుదుర్చుకోవాలని కోరింది.


