News January 15, 2026
BREAKING: మెదక్: చేగుంటలో MURDER

మెదక్ జిల్లా చేగుంట(M) అనంతసాగర్ గ్రామ శివారులో గురువారం ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. గ్రామ శివారులోని రైస్ మిల్ సమీపంలో స్థానిక సప్తగిరి కంపెనీలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన MD.సిరాజ్ (35) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Similar News
News January 17, 2026
ముంబై తీర్పుపై మోదీ ట్వీట్

ముంబై BMC ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారు కావడంతో PM మోదీ సంతోషం వ్యక్తం చేశారు. NDAపై విశ్వాసం ఉంచిన ముంబై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే ముంబై నగరంలో మరింత మెరుగైన పాలన అందిస్తామని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని MH సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.
News January 17, 2026
నేటి ముఖ్యాంశాలు

✴ 70వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: సీఎం రేవంత్
✴ ఉమ్మడి ఆదిలాబాద్‌లో సదర్మట్, చనాక-కొరాటా బ్యారేజీలను ప్రారంభించిన సీఎం
✴ మేడారంలో ఒక్కరోజే 6 లక్షల మంది భక్తుల దర్శనం
✴ మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
✴ ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్
✴ రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు?: జగన్
✴ ‘సంక్రాంతి’ తిరుగు ప్రయాణాలు.. బస్సులు, రైళ్లలో రద్దీ
News January 17, 2026
WPL: RCB హ్యాట్రిక్ విజయం

WPLలో ఆర్సీబీ వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ తడబడినా రాధా యాదవ్ 66 పరుగులతో జట్టును నిలబెట్టారు. రిచా ఘోష్ 44 పరుగులతో మద్దతు ఇవ్వగా, చివర్లో క్లర్క్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఛేజింగ్‌లో గుజరాత్ 150 పరుగులకు పరిమితమైంది. శ్రేయాంక పాటిల్ 5 వికెట్లు తీశారు.


