News December 14, 2025

BREAKING: యాదాద్రి జిల్లాలో సర్పంచ్ ఎన్నిక తొలి ఫలితం

image

యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం నీలా తండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి బానోతు శాంతి రమేశ్ విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిపై 62 ఓట్ల మెజారిటీతో బానోతు శాంతి రమేశ్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

Similar News

News December 19, 2025

జనగామ: కరెన్సీనోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని వినతి

image

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని జనగామకు చెందిన కరెన్సీపై అంబేడ్క‌ర్ పొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురాములు ఎంపీ సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పరుశురాములు మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

News December 19, 2025

ఎల్లుండి భారత్, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్

image

U19 మెన్స్ ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ ఫైనల్‌కు చేరాయి. సెమీ ఫైనల్-1లో శ్రీలంకపై భారత్, సెమీస్-2లో బంగ్లాదేశ్‌పై పాక్ గెలిచాయి. ఈ నెల 21న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్-1లో తొలుత SL 138-8 స్కోర్ చేయగా, IND 18 ఓవర్లలో ఛేదించింది. ఆరోన్ జార్జ్ 58, విహాన్ 61 పరుగులతో రాణించారు. SF-2లో ఫస్ట్ BAN 121 రన్స్‌కు ఆలౌట్ కాగా, పాక్ 16.3 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది.

News December 19, 2025

శ్రీశైలం చేరుకున్న భారత ఎన్నికల కమిషనర్

image

శ్రీశైలం మల్లన్న దర్శనార్థమై భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శ్రీశైలం చేరుకున్నారు. దేవస్థానం అతిథి గృహం వద్ద ఆయనకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, నంద్యాల కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షోరాన్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఈవో శ్రీనివాసరావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.