News February 13, 2026
BREAKING: లక్షెట్టిపేట మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 15 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 1 వార్డు బీజేపీ గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Similar News
News February 13, 2026
వేములవాడ : సీఎం రాక కోసం హెలిపాడ్ సిద్ధం..!

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక కోసం వేములవాడలో హెలిపాడ్ సిద్ధం చేశారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 14వ తేదీ శనివారం శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారని భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి, ఆలయ అధికారులకు ప్రాథమిక సమాచారం అందడంతో, సీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా గుడి చెరువు మైదానంలో హెలిపాడ్ సిద్ధం చేశారు.
News February 13, 2026
ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

విశాఖలో జరగనున్న ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మార్చి 16 నుంచి పదో తరగతి, ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు పూర్తిగా నిషేధించాలన్నారు.
News February 13, 2026
రేపు కడపకు రానున్న వైఎస్ షర్మిల

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కడప జిల్లా పర్యటనకు రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆమె రేపు కడప నగరంలో పర్యటిస్తారు. రాత్రికి ఇడుపులపాయ చేరుకొని రేపు ఉదయం కడప నగరంలోని యానాది కాలనీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయ జ్యోతి తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు


