News January 5, 2026

BREAKING: వరంగల్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి సూసైడ్

image

వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజ్‌కు చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి వంశీ వర్మ (పెద్దపల్లి జిల్లా) మామునూరులోని తన అద్దె గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి రెండు రోజుల క్రితమే తిరిగి వచ్చినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 5, 2026

MNCL: మహిళలు, బాలికల భద్రతకు అండగా షీ టీమ్స్: CP

image

మహిళలు, బాలికల భద్రతకు భరోసా, అండగా షీ టీమ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మహిళలు, బాలికల భద్రత కోసం షీటీమ్స్ నిరంతరంగా సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఎవరైనా వేధిస్తే వెంటనే 6303923700, 8712659385 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News February 5, 2026

ANU: స్పెషల్ బీఈడీ పరీక్ష ఫలితాల విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నవంబర్ నెలలో జరిగిన స్పెషల్ బీఈడీ 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. పరీక్షల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్ కోసం ఈనెల 16వ తేదీలోపు రూ.1,860 చెల్లించాలన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in చూడాలన్నారు.

News February 5, 2026

బాపట్ల అధికారులకు కలెక్టర్ సూచనలు

image

వాణిజ్య పన్నుల వసూళ్లలో బాపట్ల ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్‌ తెలిపారు. వాణిజ్య పన్నుల వసూలు ప్రక్రియపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అధికారులు పనిచేయాల్సి ఉందని కలెక్టర్ చెప్పారు. జిల్లాకు చెందిన పన్నులు పెండింగ్ లేకుండా వసూలు చేయాలన్నారు.