News December 17, 2025

BREAKING: విజయవాడలో ప్రమాదం.. మహిళ కాళ్లు ఛిద్రం..!

image

విజయవాడ సిటీ బస్టాండ్‌లో ఘోరం చోటు చేసుకుంది. కాళేశ్వరరావు మార్కెట్ నుంచి రామవరప్పాడు వెళ్లే 77వ నంబర్ బస్సు ఓ మహిళ ఎక్కుతుండగా.. బస్సు కదిలింది. దీంతో మహిళ కిందపడిపోయింది. డ్రైవర్‌ ఆపకుండా ముందుకు వెళ్లడంతో బస్సు ఆమె రెండు కాళ్లపై నుంచి వెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మహిళ రెండు కాళ్లు ఛిద్రమైపోయాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 20, 2025

తిరుమలలో చనిపోయాడు.. ఇతను మీకు తెలుసా?

image

తిరుమలలో గుర్తుతెలియని వ్యక్తి హఠాన్మరణానికి గురయ్యాడు. సుమారు 55–60 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తికి డిసెంబర్ 17న కళ్యాణకట్ట షెడ్ సమీపంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహం ప్రస్తుతం అశ్విని ఆసుపత్రి మార్చురీలో ఉంది. సమాచారం తెలిసిన వారు తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

News December 20, 2025

కేయూ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 22 నుంచి ప్రారంభం కావాల్సిన బీటెక్ 3, 5, 7వ సెమిస్టర్ పరీక్షలను డిసెంబరు 29 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎమీ ఆసీం ఇక్బాల్‌తో కలిసి శుక్రవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పూర్తి రీషెడ్యూల్ టైం టేబుల్‌ను త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు.

News December 20, 2025

భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

image

భద్రకాళి ఆలయం శనివారం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. పుష్య మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.