News November 23, 2024
BREAKING: విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి
విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి చెందిన ఘటన చిన్నగొట్టిగల్లు మండలం దేవపట్లవారిపల్లిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల పులిచర్ల అటవీ ప్రాంతం నుంచి చిన్నగొట్టిగల్లు పరిధిలోకి ఏనుగుల మంద వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి రైతులు పంటపొలాలను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.
Similar News
News November 23, 2024
చిత్తూరు:అసెస్మెంట్ కార్డులను అందించాలి
పాఠశాలలో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మండల స్థాయిలో ఎంఈఓలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా సచివాలయం నుంచి డిఈఓ వరలక్ష్మి సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి అసెస్మెంట్ కార్డులను అందించాలన్నారు.
News November 23, 2024
తిరుపతి: యునివర్సిటీలో గంజాయి కలకలం.?
తిరుపతిలోని సంస్కృత యునివర్సిటీలో గంజాయి విక్రయాలు జరిగాయన్నఆరోపణలు స్థానికంగా చర్చనీయాశం అయ్యాయి. ఓ UG విద్యార్థి ఇంటి నుంచి గంజాయి తెచ్చి విక్రయించాడంటూ పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై వర్సిటీ ఉన్నతాధికారులు, పోలీసులు స్పందిస్తూ.. ఘటనపై యాంటీ డ్రగ్ కమిటీ వేశాం. నివేదిక రాగానే చర్యలు చేపడతాం. ఇందులో భాగంగానే విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తామని వారు వెల్లడించారు.
News November 23, 2024
పెద్దిరెడ్డి అంటే ఎందుకు భయం: MLA
ఆర్థిక దోపిడీ చేయడానికి ప్రభుత్వం PAC ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వలేదని ఎర్రగొండపాలెం వైసీపీ MLA తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ‘జగన్ గారు భయపడి అసెంబ్లీకి రావడం లేదని కూటమి నాయకులు అంటున్నారు. మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూస్తే ఎందుకంత భయం? పీఏసీ ఛైర్మన్ పదవికి ఆయన నామినేషన్ వేస్తే ఎందుకు కుట్ర చేశారు?’ అని ప్రశ్నించారు. కాగా PAC ఛైర్మన్గా జనసేన MLA రామాంజినేయులు ఎన్నికయ్యారు.