News April 8, 2025
BREAKING..శామీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

శామీర్‌పేట్‌లోని జీనోమ్ వ్యాలీ PS పరిధిలో లాల్‌గడి మలక్‌పేట్ హైవేపై సఫారీ కారు డీసీఎం ఢీ కొన్నాయి. సఫారీ వాహనం సిద్దిపేట నుంచి నగరానికి వస్తుండగా డివైడర్‌కు తగిలి ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు సిద్దిపేట జిల్లా వర్గల్‌కు చెందిన రాజు, తుర్కపల్లి పరిధి మురహరిపల్లికి చెందిన శ్రవణ్‌లుగా పోలీసులు గుర్తించారు.
Similar News
News February 25, 2026
నిరుద్యోగులకు ALERT.. మార్చి 9 నుంచి అగ్నివీర్ ర్యాలీ

AP, TGలకు చెందిన నిరుద్యోగులకు ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. గుంటూరులోని ANUలో ఫిజికల్ టెస్టులు ఉంటాయి. మార్చి 9, 10 తేదీల్లో మహిళలు, 12, 13 తేదీల్లో పురుషులు నేరుగా హాజరుకావొచ్చు. 2005 జులై 2-2009 జనవరి 2 మధ్య జన్మించిన, ఇంటర్/డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. సర్టిఫికెట్ల జిరాక్స్‌లు, 10 ఫొటోలు తీసుకెళ్లాలి. రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
News February 25, 2026
ఇంటర్ పరీక్షల సందర్భంగా పకడ్బందీ బందోబస్తు: ఎస్పీ

ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్షా సమయాల్లో పరీక్ష కేంద్రాల పరిసరాలలో 163 బీఎన్ఎస్ యాక్ట్ అమల్లో ఉందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచుతున్నామని వెల్లడించారు.
News February 25, 2026
వేంపల్లి: నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో వైఎస్ జగన్

వేంపల్లి మండలం నందిపల్లెలోని నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన పులివెందులలోని తన నివాసానికి చేరుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు తన నివాసంలో విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం రెండు గంటలకు ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.


