News February 13, 2026

BREAKING: సంగారెడ్డి: కోహిర్‌లో హంగ్

image

సంగారెడ్డి జిల్లా కోహిర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8, BRS 5,బీజేపీ 1, స్వతంత్రులు 2 గెలిచారు. కాగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలవడంతో కోహిర్ మున్సిపల్ పీఠం ఆ పార్టీకి దక్కే ఛాన్స్ ఉంది.

Similar News

News February 13, 2026

ములుగులో మున్సిపాలిటీలో ఖాతా తీరిచిన బీజేపీ

image

ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్‌కి 154 ఓట్లు, బీఆర్ఎస్‌కు 173 ఓట్లు, బీజేపీకి 211 ఓట్లు లభించాయి. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఒక ఓటు నమోదు కాగా, నోటాకు 2 ఓట్లు వచ్చాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి కొత్త సురేందర్ అత్యధిక ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు.

News February 13, 2026

ములుగులో మున్సిపాలిటీలో ఖాతా తెరిచిన బీజేపీ

image

ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్‌కి 154 ఓట్లు, బీఆర్ఎస్‌కు 173 ఓట్లు, బీజేపీకి 211 ఓట్లు లభించాయి. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఒక ఓటు నమోదు కాగా, నోటాకు 2 ఓట్లు వచ్చాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి కొత్త సురేందర్ అత్యధిక ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు.

News February 13, 2026

BREAKING: ఇంద్రేశం, ఇస్నాపూర్‌లో హంగ్

image

సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇంద్రేశంలో 18 వార్డుల్లో BRS 9, కాంగ్రెస్ 6, BJP 2, ఇతరులు 1 వార్డులో గెలిచారు. ఇస్నాపూర్‌‌లో 26 వార్డులకు గాను BRS 12, కాంగ్రెస్ 10, ఇండిపెండెంట్-4 వార్డుల్లో గెలిచాయి. రెండు చోట్ల మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో హంగ్ నెలకొంది. దీంతో పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తిగా నెలకొంది.