News June 10, 2024
BREAKING: సికింద్రాబాద్ మహంకాళి బోనాల తేదీల ప్రకటన

తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన లష్కర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర తేదీలను దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు, అర్చకులు సోమవారం వెల్లడించారు. జులై 7న ఘటోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. జులై 21న బోనాలు.. 22న భవిష్యవాణి (రంగం) కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈసారి ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించనున్నామని చెప్పారు. SHARE IT
Similar News
News September 15, 2025
జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర: కేటీఆర్

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ఆగం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.
News September 15, 2025
జూబ్లీహిల్స్: ప్రతి బూత్‌కు 10 మంది

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ విజయం సాధించాలని సీఎం కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దాదాపు 407 బూత్‌లలో చురుకైన కార్యకర్తలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఒక్కో బూత్‌కు 10 మంది చొప్పున ఎంపిక చేసి హస్తానికే ఓట్లు దక్కేలా చూడాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నెల 21లోపు ఎంపిక పూర్తిచేయనున్నారు.
News September 15, 2025
HYD: ఏళ్లకేళ్లుగా సిటీలోనే తిష్ట!

నగరంలోని మెడికల్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 64 మందికి ప్రభుత్వం అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించింది. వారిని ఇక్కడి నుంచి బదిలీలు చేయడం లేదు. జిల్లా కేంద్రాల్లో ఉన్న వారిని ఇక్కడికి తెచ్చి.. ఇక్కడున్న వారిని జిల్లా కేంద్రాలకు పంపాలని జిల్లాల్లోని వారు కోరుతున్నారు. అయితే ఏళ్లకేళ్లుగా ఇక్కడే తిష్టవేసుకొని ఉంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.