News January 3, 2026
BREAKING: సిద్దిపేట: స్కూల్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి

సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి-ఎల్లుపల్లి కస్తూర్భా గాంధీ స్కూల్‌లో 7వ తరగతి విద్యార్థిని హర్షిణి అనుమానాస్పదంగా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి ఆమెను తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు చెప్పారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ మార్చురీకి మృతదేహాన్ని తరలించామన్నారు. బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన హర్షిణిగా గుర్తించారు.
Similar News
News January 30, 2026
కాని వేళకి కందులు గుగ్గిళ్లయినట్లు

సాధారణంగా ఆకలిగా ఉన్నప్పుడు లేదా ఏదైనా పండుగ సమయంలో గుగ్గిళ్లు దొరికితే చాలా సంతోషిస్తాం. కానీ, అసలు అవసరం లేని సమయంలో, కడుపు నిండుగా ఉన్నప్పుడో, ప్రాధాన్యత లేనప్పుడో అవి ఎన్ని దొరికినా ప్రయోజనం ఉండదు. అలాగే ఏదైనా సహాయం అత్యవసరంగా కావాల్సినప్పుడు అందకుండా, అంతా అయిపోయాక అందితే వ్యర్థమని, దాని వల్ల ఎలాంటి లాభం ఉండదని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.
News January 30, 2026
కుప్పంలో CM పర్యటనకు సర్వం సిద్ధం

CM చంద్రబాబు 3 రోజులు కుప్పం నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల్లో పర్యటించనున్నారు. CM పర్యటన కోసం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం గుంటూరు పర్యటన ముగించుకుని హెలికాప్టర్లో గుడిపల్లి (M) అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకొనున్నారు. అక్కడి నుంచి కుప్పం నియోజకవర్గ పర్యటన ప్రారంభిస్తారని అధికారికంగా సమాచారం వెలువడింది.
News January 30, 2026
భూమి బయట సముద్రం ఉంటుందా?

భూమ్మీద సముద్రాలుంటాయి. మరి హిరణ్యాక్షుడు భూమిని సంద్రంలో ఎలా దాచాడు? ఈ సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే పురాణాల ప్రకారం.. ఈ విశ్వంలో సగం వరకు ‘గర్భోదక జలాలు’ ఉంటాయి. ఇందులో అనంతమైన నీరు ఉంటుంది. హిరణ్యాక్షుడు భూమిని ఈ విశ్వ జలరాశి అడుగునే పడేశాడు. ఓ నీటి గిన్నెలో బంతి మునిగినట్లుగా, భూగోళం ఆ సంద్రంలో మునిగింది. అప్పుడు భగవంతుడు వరాహ రూపంలో ఆ జలాల లోపలికి వెళ్లి, భూమిని రక్షించాడు.


