News July 10, 2025
BREAKING: సిరిసిల్ల: నిరుద్యోగి ఆత్మహత్య

ఉద్యోగం రావడంలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో ఈరోజు చోటుచేసుకుంది. ఎస్ఐ రమాకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన లోకం శ్రీకాంత్(25) ఉన్నత చదువులు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెందాడు. గురువారం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. తల్లి మణెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News July 11, 2025
మెదక్: ఢిల్లీ నేషనల్ వర్క్ షాప్‌లో కలెక్టర్

ఢిల్లీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ పై జరిగిన నేషనల్ వర్క్ షాప్‌లో కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలలో అమలవుతున్న నూతన కార్యక్రమాలు, పోషణ శిక్షణకు సంబంధించిన కార్యక్రమాల గురించి వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News July 11, 2025
సంగారెడ్డి: ‘రైతులందరూ ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి’

సంగారెడ్డి మండలంలోని రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు అనేది ముఖ్యమైందని, దీని ద్వారా ప్రభుత్వ పథకాలను, రాయితీలను రైతులు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్క రైతు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
News July 11, 2025
గూడూరు: వృద్ధురాలిని కన్న కొడుకులకు అప్పగించిన పోలీసులు

గూడూరు మండలం భూపతి పేటలో వృద్ధురాలు భద్రమ్మను కన్న కొడుకులు రైతు వేదిక వద్ద వదిలేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానిక ఎస్సై గిరిధర్ రెడ్డి ఆదేశాలతో భద్రమ్మ కన్న కొడుకులను హెచ్చరించారు. పోలీసుల కౌన్సిలింగ్‌తో కన్నతల్లిని తీసుకెళ్లడానికి కొడుకులు ఒప్పుకున్నారు. మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.