News March 7, 2025
BREAKING: హనుమకొండ జిల్లాలో MURDER

హనుమకొండ జిల్లాలో కాసేపటి క్రితం దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్కతుర్తి మండలం వీర్నరాయణపూర్‌లో తల్లిని కొడుకు గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. మృతురాలు వీర్నరాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం రేవతిగా గుర్తించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 21, 2025
సిరి గోల్డ్‌తో నాకు సంబంధంలేదు: BJP ఖమ్మం చీఫ్

సిరి గోల్డ్ వ్యాపారంతో తనకెలాంటి సంబంధంలేదని BJP ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు స్పష్టంచేశారు. రాజకీయంగా ఎదురుకోలేకే అందులో పెట్టుబడులు పెట్టానని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వారి చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. త్వరలోనే వారిపై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. ప్రజలు ఈ నిరాధార ఆరోపణలు నమ్మొద్దని కోరారు.
News December 21, 2025
MBNR: ఒకే కుటుంబం.. ముగ్గురు సర్పంచ్‌లు.!

ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లి ముగ్గురు సర్పంచ్‌లుగా ఎన్నికై రికార్డు సృష్టించారు. మహేశ్వరంలోని గంగారం తండాకు మునావత్ దేవేందర్ సర్పంచ్ కాగా, NGKLజిల్లా ఉప్పునుంతల మండలం దేవాదారికుంటకు మంగమ్మ రతన్‌సింగ్, NLGజిల్లా డిండి మండలం పడమటి తండాకు దివ్యశంకర్ సర్పంచ్‌లుగా సేవలందిస్తున్నారు. వేర్వేరు జిల్లాల్లో స్థిరపడ్డ ఈ ముగ్గురూ సర్పంచ్‌లు కావడంతో హాట్ టాపిక్‌గా మారింది.
News December 21, 2025
నల్గొండ: ఈ దంపతులు GREAT

పెద్దవూర మండలం లింగంపల్లికి చెందిన హరీష్, పార్వతి గత ఏడాది అబ్కారీ కానిస్టేబుళ్లుగా ఎంపికై విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నత లక్ష్యంతో శ్రమించి.. గత నెలలో వెలువడిన గ్రూప్-2 ఫలితాల్లో హరీష్ ADOగా ఎంపికవగా, తాజాగా గ్రూప్-3 ఫలితాల్లో పార్వతి ‘ఆడిటర్’ కొలువును సొంతం చేసుకున్నారు. వరుస విజయాలతో సత్తా చాటిన ఈ దంపతులను గ్రామస్థులు, స్నేహితులు అభినందించారు.


