News March 7, 2025
BREAKING: హనుమకొండ జిల్లాలో MURDER

హనుమకొండ జిల్లాలో కాసేపటి క్రితం దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్కతుర్తి మండలం వీర్నరాయణపూర్‌లో తల్లిని కొడుకు గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. మృతురాలు వీర్నరాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం రేవతిగా గుర్తించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 29, 2026
రేపు మూలపేట పోర్టు సందర్శనకు వైసీపీ పిలుపు

కూటమి ప్రభుత్వంలో నిర్లక్ష్యంకు గురవుతున్న మూలపేట పోర్టు సందర్శన చేపట్టనున్నట్టు వైసీపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్‌లు పిలుపనిచ్చారు. కశింకోటలో జరిగిన జిల్లా ముఖ్య నేతల సమావేశంలో వారు మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలని జగన్ ఆలోచిస్తే స్పీకర్ అయ్యన్న, మంత్రి అచ్చెనాయుడు వ్యతిరేకించి ద్రోహులుగా మిగిలారని విమర్శించారు.
News March 29, 2026
నల్లగొండ: వేదిక మారింది.. రాతలు మారేనా..?

నల్లగొండ జిల్లాలో దివ్యాంగులు, వృద్ధుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం సరికొత్త శ్రీకారం చుట్టింది. ప్రతి నెల చివరి శనివారం వీరికి మాత్రమే కేటాయిస్తూ ప్రత్యేక ‘ప్రజావాణి’ని కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. సాధారణ రోజుల్లో రద్దీ వల్ల వీరు పడుతున్న ఇబ్బందులను గమనించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం అర్జీలు స్వీకరించడమే కాకుండా అక్కడికక్కడే పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు.
News March 29, 2026
మరో 2 రోజులే గడువు!

దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర మంత్రి అమిత్ షా విధించిన గడవు మరో 2 రోజుల్లో(మార్చి 31) ముగుస్తోంది. ఆపరేషన్ కగార్‌తో వందల మంది నేలకొరగగా, ఇంకెంతో మంది లొంగిపోయారు, లొంగిపోతున్నారు. ఇందులో తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ), మల్లా రాజిరెడ్డి, మల్లోజుల, పాపారావు వంటి అగ్ర నేతలు ఉన్నారు. అయితే కీలక నేత గణపతి ఇంకా సరెండర్ కాలేదు. ఆయన నేపాల్‌లో ఉన్నారని ఈ నెల 31న లొంగిపోతారని వార్తలు వస్తున్నాయి.


