News February 13, 2025

BREAKING: 19 మంది మావోయిస్టుల లొంగుబాటు

image

భద్రాద్రి: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 19 మంది జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను చూసి స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ప్రకటించారు. లొంగిపోయి సాధారణ జీవితం గడపటానికి వారు ముందుకు వచ్చారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, ఏఎస్పీ విక్రాంత్ పాల్గొన్నారు.

Similar News

News December 5, 2025

డేంజర్‌లో శ్రీశైలం డ్యాం!

image

కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం డ్యామ్ భద్రత ప్రమాదంలో ఉందని నిపుణుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. డ్యామ్ దిగువన ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ రంధ్రం డ్యామ్ పునాదుల కంటే ఎక్కువ లోతుకు విస్తరించిందని అండర్ వాటర్ పరిశీలనలో తేలింది. ఈ రంధ్రం 35–45 మీటర్ల లోతు, 150 మీటర్ల వెడల్పు ఉందని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని కమిటీ సూచించింది.

News December 5, 2025

ADB: మంత్రి బిడ్డ అయినా.. సర్పంచ్ నుంచే పాలిటిక్స్

image

ఆరుసార్లు ఎమ్మెల్యే, ఓసారి మంత్రి లాంటి వ్యక్తుల పిల్లలు రాజకీయాల్లోకి రావాలంటే నేరుగా శాసనసభ లేదా లోక్ సభ బరిలో దిగుతుంటారు. కానీ గడ్డెన్న కుమారుడు విఠల్ రెడ్డి మాత్రం తన రాజకీయ ప్రస్థానం పల్లె నుంచి మొదలుపెట్టారు. సర్పంచ్‌గా ఎన్నికైన ఆయన రెండుసార్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆ తర్వాత 2సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన సోదరుడు గోపాల్ రెడ్డి సైతం భైంసా మండలం దేగం సర్పంచ్‌గా పనిచేయడం విశేషం.

News December 5, 2025

భామిని: ‘విద్యా వ్యవస్థలో ఎవ్వరూ ఊహించని ఫలితాలు వస్తాయి’

image

రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవ్వరూ ఊహించని ఫలితాలు వస్తాయని దీనికి అంతా సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. శుక్రవారం భామినిలోని మెగా పేరెంట్స్ మీటింగ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టామన్నారు. దీనికి ప్రజల సహాయ సహకారాలు తప్పనిసరి అని కోరారు.