News December 6, 2024

BREAKING: కాసేపట్లో సంచలన ప్రకటన

image

AP: వైసీపీ మరో సంచలన ప్రకటనకు సిద్ధమైంది. బ్రేకింగ్ న్యూస్ అంటూ Xలో వైసీపీ ఓ పోస్ట్ చేసింది. ‘చాలా కాలంగా దాచిపెట్టింది చివరకు వెలుగులోకి వస్తోంది. ట్రూత్ బాంబ్ మ.ఒంటి గంటకు విడుదలవుతుంది. #BigExpose’ అని ట్వీట్ చేసింది. దీంతో వైసీపీ ఎలాంటి విషయం బయటపెడుతుందా? అనే ఆసక్తి నెలకొంది.

Similar News

News December 9, 2025

రాయ్‌బరేలిలో ‘ఓట్ చోరీ’తో గెలిచిన ఇందిరా గాంధీ: బీజేపీ MP

image

భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబె విమర్శించారు. రాయ్‌బరేలిలో ఇందిరా గాంధీ ‘ఓట్ చోరీ’తోనే గెలిచారని ఆరోపించారు. తాను RSS నుంచి వచ్చినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. లోక్‌సభలో ఎలక్షన్ రిఫామ్స్‌పై జరుగుతున్న చర్చలో RSS, ‘ఓట్ చోరీ’పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను దూబె తిప్పికొట్టారు.

News December 9, 2025

తొలి టీ20: టాస్ ఓడిన భారత్

image

కటక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గాయాల నుంచి కోలుకున్న హార్దిక్, గిల్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.
IND: సూర్య(C), గిల్, అభిషేక్, తిలక్, హార్దిక్, దూబే, అక్షర్, జితేశ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్
SA: మార్క్రమ్(C), డికాక్, స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, జాన్‌సెన్, మహరాజ్, నోర్ట్జే, సిపామ్లా, ఎంగిడి

News December 9, 2025

సపోటాలో చెక్క తెగులు – నివారణకు సూచనలు

image

చెక్క తెగులు ఆశించిన సపోటా చెట్ల కొమ్మలు వంకరులు తిరిగిపోతాయి. ఆకులు రాలిపోయి.. కొమ్మలు ఎండిపోయిన చెక్కలుగా మారతాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కొమ్మలను కత్తిరించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కల్లో ఇనుప ధాతు లోపం లేకుండా ఉండేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.