News October 17, 2024
BREAKING: తీరం దాటిన వాయుగుండం.. భారీ వర్షాలు

AP: తిరుపతి జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 22 KM వేగంతో తీరాన్ని చేరినట్లు పేర్కొంది. ఈ సమయంలో భారీ ఈదురుగాలులు వీచినట్లు తెలిపింది. ప్రస్తుతం వాయుగుండం అల్పపీడనంగా బలహీన పడుతోందని పేర్కొంది. కాగా దీని ప్రభావంతో ప్రస్తుతం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Similar News
News December 3, 2025
ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టాలి: CBN

AP: వ్యవసాయోత్పత్తులు గ్లోబల్ బ్రాండ్‌గా మారాలని తూ.గో.జిల్లా నల్లజర్లలో ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టుకోవాలి. ఫ్యాక్టరీలు, మార్కెట్‌తో అనుసంధానమవ్వాలి. ఏ పంటలతో ఆదాయమొస్తుంది? ఏ కాంబినేషన్ పంటలు వేయాలి? పరిశ్రమలకు అనుసంధానం ఎలా చేయాలి? రైతులే పరిశ్రమలు ఎలా పెట్టాలన్న అంశాలపై ప్రభుత్వం సహకరిస్తుంది’ అని తెలిపారు.
News December 3, 2025
మీక్కూడా ఫేవరెట్ కిడ్ ఉన్నారా?

చాలా కుటుంబాల్లో తెలియకుండానే ‘ఫేవరెట్ కిడ్’ ప్రభావం కనిపిస్తుందంటున్నారు నిపుణులు. తల్లిదండ్రుల ప్రేమలో తేడా లేకపోయినా.. చిన్నచిన్న సందర్భాల్లో ఈ పక్షపాతం బయట పడుతుంది. కొన్నిసార్లు ఒకరితో ఎక్కువ ఓపికగా, ఆప్యాయంగా ఉండటం చేస్తుంటారు. కొన్నిసార్లు ఇది తల్లిదండ్రులు కూడా గ్రహించకపోవచ్చు. తల్లిదండ్రులు తమను తక్కువగా చూస్తున్నారనే భావన పిల్లల్లో నెగెటివ్ ఆలోచనలను పెంచుతుందని చెబుతున్నారు.
News December 3, 2025
‘గుర్తొ’చ్చింది.. గుర్తుంచుకోండి!

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు మరో వారమే(DEC 11) ఉంది. తాజాగా అభ్యర్థులకు SEC సింబల్స్ కేటాయించింది. దీంతో ‘‘గుర్తు’ గుర్తుంచుకో.. అన్నా గుర్తుంచుకో’ అంటూ ఇంటింటి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. పార్టీలను పక్కనపెట్టి అభివృద్ధి చేసేందుకు ‘ఒక్క ఛాన్స్’ అంటూ వేడుకుంటున్నారు. ఇప్పుడు ఓటర్లు తమ వజ్రాయుధాన్ని సద్వినియోగం చేసే టైమొచ్చింది. సమర్థులైన అభ్యర్థికే ఓటు వేయాలని తప్పక గుర్తుంచుకోండి.


