News January 11, 2025
BREAKING: ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి

పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఆప్ ఎమ్మెల్యే గుర్ప్రీత్ బస్సి గోబీ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన ఇంట్లో గన్ షాట్‌కు గురైన ఆయనను కుటుంబ సభ్యులు అర్ధరాత్రి 12 గంటలకు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఆయనే గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారా? లేక మిస్ ఫైర్ జరిగి చనిపోయారా? అనేది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలుస్తుందని చెప్పారు.
Similar News
News November 21, 2025
వివేకా హత్య కేసు.. సీఐ తొలగింపు

AP: YS వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పుడు పులివెందుల సీఐగా పనిచేసిన <<17811370>>శంకరయ్యను<<>> ఉద్యోగం నుంచి తొలగిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆయన సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. కేసుకు సంబంధించి సీఎం చేసిన వ్యాఖ్యలతో తన పరువుకు భంగం కలిగిందని అందులో పేర్కొన్నారు. ఈక్రమంలోనే పోలీస్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని శంకరయ్యను డిస్మిస్ చేసింది.
News November 21, 2025
ముంబై డ్రగ్స్ పార్టీ.. హీరోయిన్ సోదరుడికి సమన్లు

ముంబై డ్రగ్స్ పార్టీ కేసులో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌కు యాంటీ నార్కోటిక్స్ సెల్ సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు రావాలని ఆదేశించింది. 20న విచారణకు గైర్హాజరైన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఒర్రీ 26న రావాలని సూచించింది. సెలబ్రిటీల కోసం పార్టీలు నిర్వహించినట్టు డ్రగ్స్ వ్యాపారి మొహమ్మద్ సలీమ్ మొహమ్మద్ సుహైల్ షేక్ అంగీకరించినట్టు ముంబై కోర్టుకు తెలిపింది.
News November 21, 2025
అండమాన్‌లో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడవచ్చని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో శనివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.


