News July 17, 2024

BREAKING: నటుడు నారాయణమూర్తికి అస్వస్థత

image

సినీ నటుడు, నిర్మాత నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. దీంతో HYD నిమ్స్ ఆస్పత్రిలో డా.బీరప్ప పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Similar News

News January 23, 2025

భార్యను చంపే ముందు ప్రాక్టీస్ కోసం..

image

TG: భార్యను చంపి ఉడికించిన <<15227723>>కేసులో<<>> సంచలనాలు వెలుగుచూశాయి. వెంకటమాధవిని చంపిన భర్త గురుమూర్తి ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్నాడు. మటన్ కొట్టే కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి కుక్కర్‌లో ఉడికించాడు. ఎముకలను కాల్చి దంచి పొడి చేశాడు. వీటన్నింటినీ కవర్లలో కట్టి డ్రైనేజీల్లో, చెరువులో పడేశాడు. భార్యను చంపడానికి ముందు అతడు ప్రాక్టీస్ కోసం కుక్కను చంపినట్లు తెలుస్తోంది.

News January 23, 2025

DOGEలో రామస్వామికి పొగపెట్టిన మస్క్!

image

భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి DOGE నుంచి తప్పుకొనేలా ఎలాన్ మస్క్ పొగపెట్టారని సమాచారం. ఇందుకోసం ఆయన గట్టిగానే పావులు కదిపారని పొలిటికో తెలిపింది. కొన్ని కారణాలతో ట్రంప్ సర్కిల్లోని కొందరు రిపబ్లికన్లు ఆయన్ను వ్యతిరేకించారని పేర్కొంది. ముందే ఆయన్ను తొలగించేందుకు సిద్ధమయ్యారని వివరించింది. H1B వీసాల అంశంలో తెల్లవారి కల్చర్‌పై ట్వీట్ అంశాన్ని వాడుకొని మస్క్ వారి మద్దతు కూడగట్టారని వెల్లడించింది.

News January 23, 2025

సుకుమార్ ఇంట్లో రెండోరోజు ఐటీ రైడ్స్

image

డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అటు పుష్ప-2 నిర్మాతలు రవిశంకర్, నవీన్, చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో మూడోరోజు రైడ్స్ జరుగుతున్నాయి. దిల్‌రాజు కుటుంబ సభ్యుల ఇళ్లతోపాటు సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై ఆరా తీస్తున్నారు.