News November 21, 2024
BREAKING: కేసుపై స్పందించిన అదానీ గ్రూప్

వ్యాపారవేత్త గౌతం అదానీపై USలోని న్యూయార్క్లో నమోదైన లంచం, ఫ్రాడ్ <<14666429>>కేసుపై <<>>అదానీ గ్రూప్ స్పందించింది. అవన్నీ అసత్య ఆరోపణలేనని తేల్చి చెప్పింది. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తామని చెప్పింది.
Similar News
News November 24, 2025
BMC బ్యాంక్లో ఉద్యోగాలు

బాంబే మర్కంటైల్ కోఆపరేటివ్(BMC) బ్యాంక్ లిమిటెడ్.. బ్యాంక్ మేనేజర్, క్రెడిట్ ఆఫీసర్, ఏరియా హెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 1, 2026వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 -50ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bmcbankltd.com/
News November 24, 2025
భారతీయ వైద్యం వైపు అమెరికన్ల మొగ్గు!

అమెరికాతో పోల్చితే ఇండియాలో వైద్య సదుపాయం చాలా బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. ఈక్రమంలో పెరుగుతున్న ఖర్చులు, వెయిటింగ్ కారణంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల రోగులు భారతీయ వైద్యం వైపు మళ్లుతున్నట్లు పేర్కొన్నారు. ‘భారత్లో అత్యల్ప ఖర్చు, తక్షణ అపాయింట్మెంట్లు (సూపర్ స్పెషలిస్ట్లతో సహా), MRI/CT స్కాన్ల వంటి త్వరిత డయాగ్నస్టిక్ సేవల వల్ల రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి’ అని తెలిపారు.
News November 24, 2025
పెరిగిన మంచు తీవ్రత.. మినుము పంటకు తెగుళ్ల ముప్పు

గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం వల్ల మినుము పంటలో.. కాయ దశలో ఆకు మచ్చ తెగులు మరియు బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంది. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా ఒక మి. లీ ప్రాపికొనజోల్ 1ml కలిపి పిచికారీ చేయాలి. వీటితో పాటు లీటరు నీటికి 1ml మైక్లోబుటానిల్ పిచికారీ చేసి బూడిద తెగులును కూడా నివారించవచ్చని వ్యవసాయ నిపుణులు తెలిపారు.


