News December 28, 2024
BREAKING: 108 సిబ్బందికి అదనంగా రూ.4,000

AP: 108, 104 సేవలకు ఇకపై సింగిల్ సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 190 కొత్త 108 వాహనాలు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. 108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ.4వేలు ఇవ్వాలని సూచించారు. దీంతో పాటు 58 మహాప్రస్థానం వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని, ప్రతి మండలంలో జనఔషధి స్టోర్స్ ఏర్పాటు చేయాలని వైద్య శాఖపై సమీక్షలో వెల్లడించారు.
Similar News
News January 14, 2026
కాసేపట్లో వర్షం..

TG: హైదరాబాద్‌లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. పటాన్చెరు, లింగపల్లి, కూకట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మేడ్చల్, నిజాంపేట్, కుత్బుల్లాపూర్, అల్వాల్, గాజులరామారం ప్రాంతాల్లో రాబోయే 2 గంటల్లో వాన పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.
News January 14, 2026
ధోనీకే సాధ్యం కానిది.. రాహుల్ రికార్డు

భారత ప్లేయర్ KL రాహుల్ ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత సాధించారు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. రాజ్‌కోట్ వేదికగా వన్డేల్లో శతకం చేసిన తొలి ఇండియన్ కూడా ఈయనే. ఓవరాల్‌గా రాహుల్‌కిది వన్డేల్లో ఎనిమిదో సెంచరీ. ఈ ఏడాదిలో భారత్ తరఫున ఇదే తొలి అంతర్జాతీయ శతకం. సెంచరీ చేసిన సమయంలో తన కూతురుకు అంకితం ఇస్తున్నట్లుగా రాహుల్ సెలబ్రేట్ చేసుకున్నారు.
News January 14, 2026
మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకుంటాయి: ట్రంప్

తమ నేషనల్ సెక్యూరిటీ కోసం గ్రీన్‌ల్యాండ్ అవసరం అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. తాము అమెరికాలో చేరబోమని, డెన్మార్క్‌లోనే ఉంటామని గ్రీన్‌ల్యాండ్ ప్రధాని ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. ‘గ్రీన్‌ల్యాండ్ అమెరికా చేతుల్లో ఉండటం వల్ల నాటో మరింత స్ట్రాంగ్ అవుతుంది. మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకుంటాయి. అది జరగనివ్వను’ అని పోస్ట్ చేశారు.


