News December 15, 2024
శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి.. త్వరలో కలుస్తా: బన్నీ

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. ‘ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో నేను శ్రీతేజ్‌ని, అతని కుటుంబాన్ని కలవకూడదని న్యాయ నిపుణులు చెప్పారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. శ్రీతేజ్ ఆస్పత్రి, కుటుంబ అవసరాలకు అండగా ఉంటాననే హామీకి కట్టుబడి ఉన్నా. సాధ్యమైనంత త్వరగా శ్రీతేజ్‌ని కలిసేందుకు ప్రయత్నిస్తా’ అని Xలో పోస్ట్ చేశారు.
Similar News
News March 3, 2026
BREAKING: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹490 తగ్గి ₹1,70,020కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు ₹450 తగ్గి ₹1,55,850 పలుకుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.
News March 3, 2026
డ్రోన్ల యుద్ధం!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో డ్రోన్లను పెద్ద సంఖ్యలో వాడుతున్నారు. ఇవాళ రియాద్‌పై, నిన్న అరామ్కో ఆయిల్ రిఫైనరీ మీద ఇరాన్ డ్రోన్లతోనే దాడి చేసింది. మిస్సైళ్లతో పోలిస్తే ధర చాలా తక్కువ కావడంతో వీటి వాడకం ఎక్కువైంది. ఇరాన్ Shahed-136 సిరీస్, తుఫాన్.. అమెరికా లూకాస్ డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఒక్కో డ్రోన్ ధర సుమారు $35,000–$50,000 కాగా, ఓ మీడియం రేంజ్ మిస్సైల్ ధర $2M-$3M ఉంటుంది.
News March 3, 2026
ముచ్చటగా మూడోసారి ఎవరిదో పైచేయి!

T20 WC సెమీస్‌లో ఎల్లుండి IND-ENG తలపడనున్నాయి. WC చరిత్రలో 2జట్లు రెండుసార్లు తలపడగా చెరోసారి గెలిచాయి. 2022 WC సెమీస్‌లో భారత్‌పై ఇంగ్లండ్ గెలవగా 2024లో ఇంగ్లిష్ జట్టును ఇండియా చిత్తు చేసింది. ఆసక్తికర విషయం ఏమిటంటే 2సార్లు సెమీస్‌లో గెలిచిన జట్టే అంతిమంగా టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో ఈ సారి ఎవరు గెలిచి కప్పు కొడతారనేది ఆసక్తిగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో రెండు జట్లూ బలంగా ఉన్నాయి.


