News June 4, 2024

Breaking: 6 లక్షల ఓట్ల ఆధిక్యంలో అమిత్ షా

image

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నారు. గుజరాత్ గాంధీనగర్ నుంచి ఆయన పోటీ చేశారు. 3 గంటల ప్రాంతంలో 6,50,399 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకారం ఆయనకు 8,58,197 ఓట్లు వచ్చాయి. మరికొద్ది సేపట్లో ఆయన గెలుపు వార్తలు రావొచ్చు. కాగా గుజరాత్‌లో బీజేపీ 26కు 25 సీట్లలో దుమ్మురేపుతోంది.

Similar News

News January 28, 2026

‘బార్డర్-2’.. ఐదు రోజుల్లో రూ.216 కోట్లు

image

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బార్డర్-2’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఐదు రోజుల్లోనే రూ.216.79 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. 1971 నాటి భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని అనురాగ్ సింగ్ తెరకెక్కించారు. హైవోల్టేజ్ వార్ సీక్వెన్స్‌లకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ మూవీలో వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి కీలక పాత్రలు పోషించారు.

News January 28, 2026

ఉలవ పంటలో బూడిద తెగులు – నివారణ

image

అధిక తేమ, రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లో ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు ఉలవ పంటలో బూడిద తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి కార్బండిజం 50% W.P 1గ్రామును కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఇదే మందును ఇదే మోతాదులో 15 రోజుల వ్యవధిలో రెండోసారి కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 28, 2026

80 గంటల్లో రెండు సార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణం

image

మహారాష్ట్ర రాజకీయాల్లో 2019 నవంబరులో ఏర్పాటైన ’80 గంటల ప్రభుత్వం’ అజిత్ పవార్‌కు రాజకీయాలలో కీలక ఘట్టం. నాటకీయ పరిణామాల నడుమ అర్ధరాత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో కలిసి Dy.CMగా పవార్ ప్రమాణం చేశారు. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో 80 Hrsలోనే ప్రభుత్వం కూలిపోయింది. వెంటనే ఆయన తిరిగి NCPకి వచ్చేసి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మరోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.