News July 11, 2024

రేపు కాంగ్రెస్‌లోకి మరో BRS MLA

image

తెలంగాణలో అధికార కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ ముమ్మరంగా కొనసాగిస్తోంది. రేపు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఆయన ఒకసారి సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎమ్మెల్సీలు హస్తం తీర్థం పుచ్చుకున్నారు.

Similar News

News January 29, 2026

ఇవాళ KCRకు సిట్ నోటీసులు?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇవాళ సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఆయనకు నోటీసులు ఇచ్చి, రేపు అక్కడే సిట్ బృందం విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈసారి ఏకంగా కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

News January 29, 2026

లవ్లీ హోం హ్యాక్స్

image

* కాఫీపొడి, పుదీనా ఆకులు, బేకింగ్ సోడా, నిమ్మతొక్కలు ఒక గిన్నెలో వేసి ఒక మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది.
* కిచెన్‌లో గట్టు, టైల్స్, కిటికీ అద్దాలు జిడ్డుగా ఉంటే పావు కప్పు వెనిగర్, చెంచా బేకింగ్ సోడా, రెండు కప్పుల నీరు కలిపి లిక్విడ్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాటిల్లో వేసి జిడ్డు ఉన్నచోట చల్లి శుభ్రం చేస్తే సరిపోతుంది.
* ఉప్పు, నిమ్మరసం కలిపి పింగాణీ పాత్రలను తోమితే మెరుస్తాయి.

News January 29, 2026

ఇంట్లో ఒప్పుకోకపోతే పారిపోదామనుకున్నాం: కీర్తి సురేశ్

image

ఇంట్లో అంగీకరించకపోతే పారిపోయి పెళ్లి చేసుకుందామని అనుకున్నట్టు హీరోయిన్ కీర్తి సురేశ్ తెలిపారు. తాను, ఆంటోని 15ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని, గ్రాండ్‌గా పెళ్లి జరుగుతుందని ఊహించలేదన్నారు. కచ్చితంగా పారిపోయి పెళ్లి చేసుకుంటామనే అనుకున్నామని చెప్పారు. తాళి కట్టే సమయంలో ఇద్దరూ అందుకే ఎమోషనల్ అయినట్టు తెలిపారు. ఆంటోనీ కళ్లలో నీళ్లు మొదటిసారి చూశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 2024లో వీరి పెళ్లి జరిగింది.