News July 6, 2024

BREAKING: కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

image

TG: విపక్ష బీఆర్ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా కృష్ణమోహన్‌తో కలిపి ఇప్పటి వరకు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు.

Similar News

News December 8, 2025

భద్రాచలం: పట్టుబడిన సుమారు రూ.కోటి నిషేధిత గంజాయి

image

కూనవరం రోడ్లో ఎస్ఐ సతీష్ నిర్వహించిన వాహన తనిఖీల్లో 222.966 కేజీల గంజాయి లభ్యమైనట్టు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కూనవరం నుంచి భద్రాచలం వైపుగా వెళ్తున్న లారీని ఆపి తనిఖీలు చేయగా ప్రభుత్వ నిషేధిత 110 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.1,11,48,300 ఉంటుందని చెప్పారు. బుచ్చయ్య, రమేష్, షేక్ షఫివుద్దిన్, మహమ్మద్ మోసిన్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

News December 8, 2025

ఇండిగో అంశం కేంద్రం పరిధిలోనిది: చంద్రబాబు

image

AP: ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరిస్తుందన్నారు. కేంద్రమంత్రి భారత ప్రభుత్వానికి జవాబుదారీ అని చంద్రబాబు తెలిపారు. కాగా ఇండిగో సంక్షోభాన్ని మంత్రి లోకేశ్ మానిటర్ చేస్తున్నారని ఇటీవల ఓ టీవీ డిబేట్‌లో టీడీపీ MLC దీపక్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి.

News December 8, 2025

10ఏళ్లలో రూ.కోటి విలువ రూ.55లక్షలే!

image

మీరు దాచుకున్న డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుందనే విషయం మీకు తెలుసా? మీ దగ్గర రూ.కోటి ఉంటే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం(6%) కొనసాగితే మరో పదేళ్లలో అది ₹55.8 లక్షలకు చేరనుంది. 2045లో రూ.31.18లక్షలు, 2075నాటికి ₹కోటి విలువ రూ.5.4లక్షలకు పడిపోనుంది. అందుకే డబ్బును పొదుపు చేయడంతో పాటు సంపద విలువను కాపాడుకోవడానికి పెట్టుబడి పెట్టడం అలవర్చుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.