News October 17, 2024

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు

image

AP: ఈనెల 22న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD ప్రకటించింది. దీని ప్రభావంతో రేపు కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, NTR, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని వెల్లడించింది. కాగా వాయుగుండం ఇవాళే తీరం దాటిన విషయం తెలిసిందే.

Similar News

News October 17, 2024

సూపర్ మార్కెట్‌లో ధరలపై మంత్రి ఆగ్రహం

image

AP: మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని రైతు బజార్, సూపర్ మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూరగాయల ధరలు, స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. సూపర్ మార్కెట్‌లో కూరగాయలను ఎక్కువ ధరలకు అమ్మడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తమ ప్రభుత్వం రాయితీపై రేషన్ షాపుల్లో ఉల్లి, టమాటా, కందిపప్పు, నూనె అందిస్తున్నట్లు తెలిపారు.

News October 17, 2024

పురుషులకూ బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు

image

బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారి స్త్రీలకు మాత్రమే వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ పురుషుల్లోనూ వస్తుందని ఆంకాలజిస్ట్ డాక్టర్ సీఎన్ పాటిల్ తెలిపారు. ‘అరుదే అయినా వచ్చే ప్రమాదం లేకపోలేదు. హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, పర్యావరణం దీనికి కారణం కావొచ్చు. 60 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉన్న పురుషులకు రిస్క్ ఎక్కువ. ఛాతీలో గడ్డ కనిపిస్తే వెంటనే పరీక్షించుకోవడం ఉత్తమం’ అని వివరించారు.

News October 17, 2024

సురేఖపై పరువు నష్టం కేసు.. రేపు కోర్టుకు KTR

image

TG: మంత్రి సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్ రేపు నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. జడ్జి ముందు ఆయన తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. కాగా నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో నాగార్జున, కేటీఆర్‌పై సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై ఇప్పటికే నాగార్జున డిఫమేషన్ కేసు వేసి, కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.