News April 2, 2025
BREAKING: మయన్మార్లో మరోసారి భూకంపం

వరుస భూకంపాలు మయన్మార్ ప్రజలకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మయన్మార్లో మరోసారి భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. 4.15pmకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. గత నెల 28న సంభవించిన భారీ భూకంపానికి ఇప్పటివరకూ 2,700 మందికి పైగా చనిపోగా శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు.
Similar News
News April 3, 2025
కంచ భూములపై ఫేక్ వీడియోలు.. BRS IT సెల్ ఇంచార్జిలపై కేసు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచె భూములను ప్రభుత్వం చదును చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అక్కడి పరిస్థితులను తప్పుదోవ పట్టించేలా కొన్ని ఫొటోలు, వీడియోలు ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈక్రమంలో గచ్చిబౌలి పోలీసులు ఫేక్ వీడియోలను క్రియేట్ చేశారనే ఆరోపణలపై BRS IT సెల్ ఇంచార్జ్లు క్రిశాంక్ & కొణతం దిలీప్లపై కేసు నమోదు చేశారు.
News April 3, 2025
HCU కంచ భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

TG: కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు చెట్లు నరికివేయొద్దని, భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికపై విచారణ సందర్భంగా SC కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది చాలా సీరియస్ విషయం. చట్టాన్ని మీరు ఎలా చేతుల్లోకి తీసుకుంటారు’ అని CSపై ఆగ్రహిస్తూ ప్రతివాదిగా చేర్చింది.
News April 3, 2025
నష్టాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. US అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల ప్రభావం మార్కెట్లపై పడింది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సంకోచించారు. సెన్సెక్స్ 322 నష్టంతో 76,295 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 23,250 వద్ద ముగిశాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా సంస్థల షేర్లు లాభాల్లో ట్రేడవగా, TCS, టెక్ మహీంద్ర, HCL, ఇన్ఫోసిస్, ONGC షేర్లు నష్టాల్లో ముగిశాయి.