News September 13, 2024
BREAKING: మరో అల్పపీడనం

AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది ఆగ్నేయ బంగ్లాదేశ్ సమీపంలో కేంద్రీకృతమైందని, క్రమంగా బలపడుతోందని తెలిపింది. రేపటికి వాయుగుండంగా మారనుందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు పడతాయని ప్రకటించింది. కాగా ఇవాళ విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వాన కురుస్తోంది.
Similar News
News January 12, 2026
ఎగ్ ఫ్రీజింగ్ ఎన్నాళ్లు చేసుకోవచ్చంటే?

సాధారణంగా 10 సంవత్సరాల వరకు ఎగ్ ఫ్రీజ్ చేయించుకోవచ్చు. అవసరమైతే ఈ కాలాన్ని పొడిగించవచ్చు. కొన్ని బీమా కంపెనీలు ఎగ్ ఫ్రీజింగ్ ఖర్చును భరిస్తాయి. కెరీర్లో రాజీపడకుండా వృద్ధాప్యంలో కూడా తల్లి అయిన ఆనందాన్ని ఎగ్ ఫ్రీజింగ్ సహాయంతో ఆస్వాదించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్న మహిళలు కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవచ్చు. ఈ ప్రక్రియ సహాయంతో కోరుకున్నప్పుడు తల్లి కావచ్చు.
News January 12, 2026
వృద్ధుల కోసం డేకేర్ సెంటర్లు.. నేడే ప్రారంభం

TG: ఒంటరితనంతో బాధపడుతున్న 60yrs+ వృద్ధుల కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 37 ‘ప్రణామ్’ డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. నేడు ప్రజాభవన్లో CM రేవంత్ వర్చువల్గా 18 సెంటర్లను ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాల్లో హెల్త్ చెకప్, యోగా, మెడిటేషన్, టీవీ, కంప్యూటర్, ఇండోర్ గేమ్స్ ఉంటాయి. హాలిడేలు మినహా మిగతా రోజుల్లో (9am-6pm) పనిచేస్తాయి. అటు చిన్నారుల కోసం <<18381207>>’బాల భరోసా’<<>> స్కీమ్నూ CM ఈరోజు ప్రారంభిస్తారు.
News January 12, 2026
మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి(86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ అమీర్పేటలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు ఆమె నివాసానికి వెళ్లి నివాళి అర్పిస్తున్నారు. కాగా రోశయ్య 2021లో మరణించారు. ఆయన 2009-10 మధ్య ఏపీ సీఎంగా పనిచేశారు. 2011-16 మధ్య తమిళనాడు గవర్నర్గా సేవలందించారు.


