News September 18, 2024

వైసీపీకి బాలినేని రాజీనామా.. రేపు పవన్‌తో భేటీ

image

AP: ప్రకాశం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ సీఎం జగన్‌కు బాలినేని పంపారు. పార్టీ తీరుపై ఎన్నికల సమయం నుంచి అసంతృప్తిగా ఉన్న ఆయన ఇటీవల జగన్‌తో భేటీ అనంతరం కూడా బెట్టు వీడలేదు. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ కానున్న బాలినేని జనసేనలో చేరికపై ఆయనతో చర్చించనున్నారు.

Similar News

News September 14, 2025

బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే ఏఐ

image

అధునాతన చికిత్సా విధానాలెన్నున్నా ఇప్పటికీ మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌‌తో మరణించేవారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని అరికట్టడానికి USలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు మిరాయ్ అనే ఏఐ సాధనాన్ని తయారుచేశారు. ఇది ఐదేళ్ల ముందుగానే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తిస్తుందని వారు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సాధనాలతో పోలిస్తే మిరాయ్ రెండు రెట్లు ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు.

News September 14, 2025

ALERT: రోడ్డుపై చెత్త వేస్తే 8 రోజుల జైలు శిక్ష

image

TG: హైదరాబాద్‌లో రోడ్లపై చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెస్ట్ జోన్ DCP విజయ్‌కుమార్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. చెత్త వేసే వారిని చట్టప్రకారం నేరస్థులుగా పరిగణిస్తూ 8 రోజుల వరకు శిక్ష విధిస్తున్నారు. ఈ క్రమంలో బోరబండ PS పరిధిలో రోడ్లపై చెత్త వేసిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి మీద ఛార్జిషీటు దాఖలు చేసి జడ్జి ముందు హాజరుపరచగా 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

News September 14, 2025

ముప్పైల్లోనే ముడతలా..?

image

ప్రస్తుతం చాలామందిలో ప్రీమెచ్యూర్ ఏజింగ్ కనిపిస్తోంది. ఫోన్లు, ల్యాప్‌టాప్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా చిన్నవయసులోనే వృద్ధాప్యఛాయలు కన్పిస్తున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. బ్లూ లైట్‌కు ఎక్కువగా ప్రభావితం కావడం వల్ల చర్మం సాగే గుణం కోల్పోతుంది. దీంతో ముడతలు వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే గ్యాడ్జెట్లను తక్కువగా వాడటంతోపాటు బ్లూ లైట్ ఎఫెక్ట్‌ను తగ్గించే హైలురోనిక్ యాసిడ్ ఉన్న క్రీములను వాడాలి.